![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -107 లో.. రామలక్ష్మి డల్ గా ఉండటం చూసిన సీతాకాంత్.. గతం తాలూకు జ్ఞాపకాలు మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే లైఫ్ బాగుంటుందని చెప్తాడు. మీరు పక్కన ఉంటే ఎంత పెద్ద సమస్య అయిన అందంగా కన్పిస్తుందని రామలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత సందీప్, శ్రీలత దగ్గరకి అభి కనబడుట లేదు అనే పాంప్లెట్ వేయించి తీసుకొని వస్తాడు. ఇవి అన్ని పేపర్స్ లో పెట్టించావా అని శ్రీలత అడుగుతుంది. పెట్టించాను ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారని సందీప్ అంటాడు.
కథ నేను నడిపస్తానని శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే శ్రీలత, సందీప్ లు పేపర్ పట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఆ తర్వాత కావాలనే సందీప్ పేపర్ చదువుతుంటే.. తినేటప్పుడు కూడా పేపర్ ఏంటని శ్రీలత కింద పడేస్తుంది. అప్పుడు పాంప్లెట్ కన్పిస్తుంది. అది చూసి రామలక్ష్మి, సీతాకాంత్ లు షాక్ అవుతారు. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుందని శ్రీలత అంటుంది. నీతో మాట్లాడడం చూసానని రామలక్ష్మిని శ్రీలత అడుగుతుంది. తెలుసు.. అతను రామలక్ష్మి ఫ్రెండ్ అని సీతాకాంత్ అంటాడు. మరి నీ ఫ్రెండ్ గురించి నీకు తెలియదా అని శ్రీలత అడుగగా.. తెలియదని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి పరాధ్యనములో ఆలోచిస్తుంటే.. సీతాకాంత్ పిలుస్తాడు. నాకు అంత అయోమయంగా ఉంది సర్ అని రామలక్ష్మి అంటుంది. నేను కనుక్కుంటానని సీతాకాంత్ వెళ్ళిపోతాడు. కాసేపటికి అభి ఇంటికి సీతాకాంత్ వెళ్తాడు. అక్కడ తాళం వేసి ఉంటుంది.
ఆ తర్వాత అభిని వెతికే పనిలో సీతాకాంత్ ఉంటాడు. దాంతో అభి ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది. అన్నయ్యని ఫాలో అవ్వమని మన మనుషులకి చెప్పానని సందేప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి ఫైల్ కావాలని పెద్దాయన వస్తాడు. సీతాకాంత్ అతనికి కీ ఇస్తాడు. పెద్దాయన ఫైల్ తీస్తుండగా అందులో నుండి ఒక కవర్ కింద పడుతుంది. అది మళ్ళీ ఫైల్ లోనే పెడతాడు. మరొకవైపు మాణిక్యానికి ధన ఆఫీస్ లో కన్పిస్తాడు. బిజీనెస్ గురించి ధన మాణిక్యానికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |